అప్పుల బారినపడి, సదుపాయాలు లేక మన రాష్ట్ర చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం అమెరికాలోని ఒక బాలికను కదిలించింది. వారి దీనావస్థలను ప్రపంచానికి తెలియజెప్పి వారికి అండగా నిలవాలని సంకల్పించింది. ఆమె ఎవరంటే, అమెరికాలోని న్యూజెర్సీలో లివింగ్‌స్టన్ ఉన్నత పాఠశాలలో టెన్త్ గ్రేడ్ విద్యార్థిని. పేరు ఎప్పనపల్లి పూజా జ్యోతి. చేనేత కార్మికుల సంక్షేమం లక్ష్యంగా http://www.saveweavers.org అనే వెబ్‌సైట్ ప్రారంభించింది. దీని ద్వారా లక్ష సంతకాలు సేకరించి, తగిన చర్యల నిమిత్తం వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నది పూజా జ్యోతి లక్ష్యం.
చేనేత కార్మికులు జీవితాలు బాగుపడేందుకుగాను ప్రభుత్వ సంస్థలు, ఆసుపత్రులు, పాఠశాలలు, జైళ్ళు, సైన్యం విధిగా చేనేత ఉత్పత్తులు ధరింపజేసి, ప్రజల్లోనూ ఈ చైతన్యం తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నది జ్యోతి సలహా. ఈ చిన్నారి చేపట్టిన ఈ మహత్కార్యానికి అమెరికా, బ్రిటన్, అస్ట్రేలియాతో బాటు వివిధ దేశాల్లోని ప్రవాస భారతీయులు మద్దతు పలికారు.
పూజకు ఈ ఆలోచన వచ్చినప్పుడు సాఫ్ట్‌వేర్ నిపుణుడైన ఆమె తండ్రి ఇ.హరికిషన్ తన కుమార్తెను ప్రోత్సహించి ముందుకు నడిపించారు. ఆమె చేపట్టిన ఈ "సామాజిక పూజ" ఫలించాలని మనమూ కోరుకుందాం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment