భద్రాచల రామాలయంలోని కళ్యాణకట్టలో కేశఖండన పని చేసే ఉద్యోగి కృష్ణ ఇదే ఆలయంలో సంగీత వాద్య కళాకారులకు శృతినందించే బాధ్యతలు కూడా నిర్వహించేవాడు. ఏమైందో ఏమో... మానసిక వైకల్యంతో తాగుబోతుగా మారి విధులకు ఎగనామం పెట్టే పరిస్థితి వచ్చింది.
భార్యకు ఏమైనా అయితే చాలా తేలిగ్గా వాళ్ళను వదిలించుకునే మగాళ్ళున్న రోజులివి. కానీ కృష్ణ భార్య లక్ష్మి మాత్రం భర్త ఎలా మారినా ఇల్లాలిగా, అమ్మగా కుటుంబాన్ని గుట్టుగా నడుపుకుంటూ వచ్చింది. ఒక దశలో అతను పూర్తిగా ఆలయానికి దూరమయ్యే రోజులొచ్చాయి. దాంతో ఆలయంలో ఇతని బాధ్యతల్ని (కేశఖండన, శృతి అందించడం) తానే స్వీకరించింది.
మూడేళ్ళ పాటు లక్ష్మి చిత్తశుద్ధిని గమనించిన ఆలయ అధికార్లు ఆమెను పూర్తిస్థాయిలో సంగీత కళాకారుల బృందంలో చేర్చారు. గడచిన శ్రీరామ నవమి ఉత్సవాల్లో సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకూ తన సంగీతంతో శ్రీరాముణ్ణి సేవించే భాగ్యం ఈమెకు కలిగింది.
Wednesday, September 29, 2010
Tuesday, August 31, 2010
కన్వర్ ఆయుధం... నెంబర్ 100
పదకొండు సంవత్సరాల ఆ బాలికకు ఆరోజు పెళ్ళి చూపులు. ఆమెకేమో చదువంటే మహా ప్రాణం. పెళ్ళివారు చూసుకోవడానికి వచ్చేశారు. వారికి ఇంట్లోవాళ్ళు రాచ మర్యాదలు చేస్తున్నారు. ఇక ఉండబట్టలేకపోయింది ఈ చిన్నారి. వెంటనే వారిముందుకు దూసుకెళ్ళి పెళ్ళి ఊసు ఎత్తారంటే నెంబర్ 100 (పోలీస్)కు ఫోన్ చేస్తానని అరిచింది. ఇక ఈ సంబంధం మాకొద్దు బాబోయ్ అంటూ మగపెళ్ళివారు వెనక్కి తిరగకుండా పరుగుతీశారు. వారిని పరుగుపెట్టించిన అమ్మాయి రాజస్థాన్‌లోని రాజ్‌పుట్ వర్గానికి చెందిన బాలిక కన్వర్ సోంధియా.
ఝలవార్ జిల్లా డాగ్ గ్రామంలో నివసించే కన్వర్ పని తమ ఇంట్లో పశువుల్ని మేతకు తీసుకెళ్ళడం, అందరూ తిన్న తర్వాత అంట్లు తోమడం. ఈమెకు ముగ్గురు అన్నలు, ముగ్గురు అక్కలు. అక్కలందరికీ పదేళ్ళ వయసుకే పెళ్ళిళ్ళు అయిపోయాయి. తర్వాత కన్వర్ వంతు. అన్నలంతా బడికి వెళుతుంటే ఆగలేక తననూ పంపించమని అమ్మానాన్నల్ని అడిగింది. ఇంట్లో పనెవరూ చేస్తారంటూ వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా పట్టువీడలేదీమె. ఇంటిపని అయ్యాకే బడికెళతానని చెప్పింది. పెద్దలు చివరికి ఒప్పుకుని పంపించినా రోజూ రుసరుసలే. ధైర్యం చేసిన కన్వర్ అక్కడి పోలీస్ అధికార్లను కూడా కలుసుకుంది. మీ పెద్దవాళ్ళు కొడితే 100కు ఫోన్ చెయ్యమని చెప్పారు. అదే ఈమె ఆయుధం. ఆ ఊరిలో ఒక స్వచ్ఛంద సంస్థవారు ఏర్పాటు చేసిన ప్రభాత్‌శాల బడిలో చదువుతున్న కన్వర్ తన పరిస్థితి గురించి తన ఉపాధ్యాయులకు వివరించింది. అలాంటి పరిస్థితుల్లోనే పైన చెప్పిన పెళ్ళి సంబంధం రావడం... నెంబర్ 100తో బెదిరించి వారిని సాగనండం అయ్యింది.
ఆ తర్వాత ధోరణి మార్చుకున్న ఈమె అమ్మానాన్నలు వెనక్కి తగ్గారు. కన్వర్ మంచి మాటలతో ఈమె తండ్రి మద్యం కూడా మానేశాడు. బాల్య వివాహంపై తిరగబడిన ఈ చిన్నారి గురించి తెలుసుకున్న అధికార్లు పైకి సిఫారసు చెయ్యడంతో 2008లో ఈమెకు జాతీయ సాహస బాలల పురస్కారం కూడా దక్కింది. రాష్ట్రప్రతి, ప్రధానమంత్రుల్ని కలుసుకునే అవకాశం వచ్చింది. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన "ప్రపంచ బాలల స్థితిగతుల నివేదిక - 2007" ఆవిష్కరణ, యునిసెఫ్ కార్యక్రమాల్లోనూ పాల్గొంది.
డాగ్ గ్రామ పరిసరాల్లో బాల్యవివాహాలు చేసేవారికి కన్వర్ పేరు తల్వార్‌లా వినిపిస్తుంది.

Monday, July 26, 2010
లక్ష్మీకాంతం... కోమల హృదయం
"ఇంటికంటే గుడిపదిలం" అని మనకో పాత సామెత ఉంది. నేటి పరిస్థితులు అలా లేవుగానీ... అనాథలకోసం పదిలమైన గుడిలాంటి వాతావరణాన్ని మాత్రం ఏర్పాటు చెయ్యగలిగారు విశాఖపట్నానికి చెందిన చదరం లక్ష్మీకాంతం. తనకు వచ్చే పింఛన్, తన ఇంటి బాడుగ మొత్తం, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న తన పిల్లలు పంపే మొత్తంతో ఈమె తన సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తుంటారు. అంధులు, అన్నార్తులు, వృద్ధులకు అండగా ఉంటున్నారీమె.
సుమారు 45 ఏళ్ళ కిందట భర్త జగన్నాథంతో కొత్తవలసలో కాపురం చేసే రోజుల్లోనే అక్కడ మహిళామండలిని నెలకొల్పిన లక్ష్మీకాంతం ఆ తర్వాత విశాఖపట్టణం వచ్చి గీతా మహిళామండలిలో సేవలందించారు. ఇక్కడ పలువురు మహిళలకు కట్లు అల్లికలు, నాట్య కళల్లో శిక్షణనిప్పించారు. శ్రీ గౌరీ సత్యసాయి సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తూ సామూహిక వివాహాలకూ తోడ్పాటునిస్తున్నారు. ఈ అమ్మా....యి అందరికీ ఆదర్శం కదూ...

Monday, May 31, 2010
మనసున్న మానస...
మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని బ్రిలియంట్ గ్రామర్ పాఠశాలలో 10వ తరగతి చదువుకుంటున్న మానస అనే విద్యార్థిని తన పెద్ద మనసును చాటుకుంది. ఈ మధ్య స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా బల్మూర్ మండలం తుమ్మన్‌పేట వివేకానంద యువజన సంఘం నిర్వహించిన ప్రతిభా పరీక్షల్లో ఈమె విజేతగా నిలిచి ఐదు వేల రూపాయల నగదు బహుమతిని అందుకుంది. బహుమతి ఒక్కటే కాదు... దానితోపాటు వివేకానందుని ఆదర్శాల్నికూడా అందిపుచ్చుకుందీ చిన్నారి. తనకు వచ్చిన బహుమతితో వెరైటీ డ్రెస్‌లు, హైహీల్స్, ఫ్యాషన్ వస్తువులు కొనుక్కోలేదు. ఈ బహుమతి మొత్తంలో 1,116 రూపాయల్ని అచ్చంపేటలో ఖదీర్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి విరాళంగా ఇచ్చింది. అంతేగాక ఇక్కడి వృద్ధులకు అన్నదానం చేసింది. మానస తండ్రి దామోదర్ గౌడ్ లింగాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. మానసకున్న పెద్ద మనసును నేటి సమాజం అంతా అందిపుచ్చుకోవాల్సి ఉంది.... ఈమె మన నిజమైన అమ్మా...యి
Friday, April 30, 2010
పట్టభద్రురాలు... లారీ చోదకురాలు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన యోగితకు రాజ్ బహదూర్‌తో పెళ్ళయ్యే వరకూ అమ్మానాన్నల చాటుబిడ్డగానే ఉంది. లారీ డ్రైవర్ అయిన భర్త, ఇద్దరు పిల్లలతో సజావుగా జీవితం సాగిపోతుండగా సమయాన్ని వృథా చెయ్యడమెందుకని కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, న్యాయశాస్త్రంలో బిఎల్ పట్టా కూడా సాధించింది. ఇవిగాక ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో డిప్లొమాలు అందుకుంది. అన్నీ మనం అనుకున్నట్లే జరిగితే ఇది జీవితం ఎందుకవుతుంది. ఒక రోడ్డు ప్రమాదంలో యోగిత భర్త చనిపోయాడు. ఇక తాను చదువుకున్న చదువులు, నేర్చుకున్న వృత్తి విద్యలతో జీవితాన్ని నెట్టుకొద్దామనుకున్న యోగితకు అవి నాలుగు మెతుకులు కూడా పెట్టలేదు. ఇలా లాభం లేదనుకున్న యోగిత, తన భర్త విడిచిన లారీ స్టీరింగ్‌ను తాను అందుకుని ఎలాగో లారీ డ్రైవింగ్ నేర్చుకుంది. లారీ డ్రైవింగ్‌లో తొలి మహిళగా గుర్తింపు పొందడమేగాక మధ్యప్రదేశ్‌లో ఉత్తమ లారీ డ్రైవర్‌గానూ గౌరవం అందుకుంది ఈ యోగ్యురాలు. భర్త పోయిన మహిళలు సాధారణంగా పుట్టింటివైపు దీనంగా చూస్తుంటారు. నిజానికి వీరంతా చూడాల్సింది ఆదర్శనారి యోగితలాంటి వారివైపు....
Tuesday, March 30, 2010
ఆరతి... సేవా నిరతి
అది ఒరిస్సాలోని బెల్పహార్ గ్రామం... అనాథ బాలలకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు అక్కడ "గ్రామశ్రీ" అనే మంచి పేరున్న అనాథాశ్రమం ఒకటి ఉండేది. అక్కడి పిల్లలకు చదువులో సహకరించేందుకు ఆరతీ బిశ్వాస్ అనే 17 ఏళ్ళ యువతి వస్తుండేది. ఆశ్రమం నిర్వహకులు ఆ చిన్నారుల్ని ఎలా వేధిస్తున్నారో కళ్ళారా చూచిన ఆరతి ఇదే విషయాన్ని ఆశ్రమం యాజమాన్యం దృష్టికి తీసుకెళితే వాళ్ళు ఈమెనే పంపించేశారు. దాంతో తానే స్వయంగా అనాథ బాలలకోసం ఆశ్రమం స్థాపించి నిజమైన ప్రేమను అందించాలని నిర్ణయించుకుంది. వెంటనే ఆశ్రమం ఏర్పాటుకోసం ప్రభుత్వ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకుంది. 17 ఏళ్ళ పిల్ల అనాథాశ్రమం పెడతానంటే అక్కడి ప్రభుత్వాధికార్లు నమ్మలేదు సరికదా ఫైలు కదలాలంటే చెయ్యి తడపాల్సిందేనన్నారు. డబ్బులివ్వడం ఆరతికి ఇష్టంలేదు. అలా రెండేళ్ళు గడిచిపోయాయి. కాస్త ఆలస్యమైనాగానీ మంచతనానిదే విజయమని రుజువైంది. ఇక్కడి ప్రభుత్వ కార్యాలయంలో అడుగుపెట్టిన ఒక నిజాయితీపరుడైన సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆరతి చెప్పిందంతా విని ఆశ్రమం ఏర్పాటుకు చేయూతనిచ్చారు. అదే "థక్కర్ బప్పా సేవాసదన్". ఇక్కడి సేవల్లోని స్వచ్ఛతను గమనించిన నాటి జిల్లా కలెక్టర్ కూడా నెల నెలా చిన్నారుల సంక్షేమం కోసం నిధులందేలా ఏర్పాటు చేశారు. ఇదంతా జరిగి దాదాపు 25 ఏళ్ళు గడిచింది. ఇప్పుడు బెల్పహార్ పర్యటనకు వెళ్ళే రాజకీయనాయకులెవరైనా "థక్కర్ బప్పా సేవాసదన్"కు వెళ్ళి ఒక ఫోటో తీయించుకుంటేనే వారు నిఖార్సైన నేతలనే గుర్తింపు వస్తుంది. ఏ స్త్రీ అయినా మాతృత్వం కోసమే పెళ్ళి చేసుకుంటుంది. మరి అమ్మా అంటూ ఆరతి చుట్టూచేరే పిల్లలు బోలెడు మంది ఉండటంతో ఆమెకు భర్త అవసరం రాలేదు....
Saturday, February 27, 2010
చదువుకోసం ఆస్తి దానం
వరంగల్ జిల్లా మంగపేట మండలంలోని మారుమూల పల్లె నర్సాపురంలో పుట్టిన సరోజినికి చదువంటే పంచ ప్రాణాలు. తాను పుట్టింది రైతుకుటుంబం కావడం, నాటి ఆచారాలు అడ్డురావడంతో ఆ కోరిక తీరలేదు. పైగా తొమ్మిదేళ్ళకే పెళ్ళయిపోయింది. భర్త ఎక్కటి శేషారెడ్డి పరకాల మండలం ద్వారకపేటకు చెందినవారు. ఆయన సివిల్ ఇంజనీర్ కావడంతో 1969లో ఉద్యోగార్థం భర్తతో అమెరికాలో స్థిరపడ్డారు. ఎక్కడికెళ్ళినా సరోజినికి తాను చదువుకోలేదన్న బెంగ మాత్రం అలాగే ఉండిపోయింది. తన చిన్నతనంలో తనలాంటి ఆడపిల్లలు పడిన పాట్లు నేటి పిల్లలు పడకూడదని భావించారు. ఈ క్రమంలో అమెరికాలో "బేబీకేర్ సెంటర్" ప్రారంభించిన సరోజిని తాను ఆర్జించిన మొత్తంతో స్వంత ఊరికి ఏమైనా చెయ్యాలని సంకల్పించారు. భర్త తోడ్పాటుతో మంగపేటలో జూనియర్ కళాశాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. అదే సమయంలో భర్త మరణించడంతో వేదనకు గురైనా తన సంకల్పాన్ని వీడని సరోజిని తన ఆస్తి మొత్తాన్ని విద్యావ్యాప్తికే అంకితం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం 55.5 లక్షల విలువైన భూమిని, 26.5 లక్షల రూపాయల్ని కళాశాలకోసం ఇచ్చేశారు. ఇందుకు సంబంధించిన ఆస్తుల పత్రాల్ని 2007లో స్టేషన్ ఘన్‌పూర్ వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రికి స్వాధీనపరిచారు. భవిష్యత్తులో ఒక ఇంగ్లీష్ మీడియం పాఠశాల, వృద్ధాశ్రమం ఏర్పాటు తన లక్ష్యాల్లో ఉన్నాయని చెప్పిన మన సరోజిని చదువుల తల్లి సరస్వతికి నిజమైన బిడ్డ అనడంలో సందేహమేంటి...
Subscribe to:
Posts (Atom)