Tuesday, March 30, 2010

ఆరతి... సేవా నిరతి

అది ఒరిస్సాలోని బెల్పహార్ గ్రామం... అనాథ బాలలకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు అక్కడ "గ్రామశ్రీ" అనే మంచి పేరున్న అనాథాశ్రమం ఒకటి ఉండేది. అక్కడి పిల్లలకు చదువులో సహకరించేందుకు ఆరతీ బిశ్వాస్ అనే 17 ఏళ్ళ యువతి వస్తుండేది. ఆశ్రమం నిర్వహకులు ఆ చిన్నారుల్ని ఎలా వేధిస్తున్నారో కళ్ళారా చూచిన ఆరతి ఇదే విషయాన్ని ఆశ్రమం యాజమాన్యం దృష్టికి తీసుకెళితే వాళ్ళు ఈమెనే పంపించేశారు. దాంతో తానే స్వయంగా అనాథ బాలలకోసం ఆశ్రమం స్థాపించి నిజమైన ప్రేమను అందించాలని నిర్ణయించుకుంది. వెంటనే ఆశ్రమం ఏర్పాటుకోసం ప్రభుత్వ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకుంది. 17 ఏళ్ళ పిల్ల అనాథాశ్రమం పెడతానంటే అక్కడి ప్రభుత్వాధికార్లు నమ్మలేదు సరికదా ఫైలు కదలాలంటే చెయ్యి తడపాల్సిందేనన్నారు. డబ్బులివ్వడం ఆరతికి ఇష్టంలేదు. అలా రెండేళ్ళు గడిచిపోయాయి. కాస్త ఆలస్యమైనాగానీ మంచతనానిదే విజయమని రుజువైంది. ఇక్కడి ప్రభుత్వ కార్యాలయంలో అడుగుపెట్టిన ఒక నిజాయితీపరుడైన సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆరతి చెప్పిందంతా విని ఆశ్రమం ఏర్పాటుకు చేయూతనిచ్చారు. అదే "థక్కర్ బప్పా సేవాసదన్". ఇక్కడి సేవల్లోని స్వచ్ఛతను గమనించిన నాటి జిల్లా కలెక్టర్ కూడా నెల నెలా చిన్నారుల సంక్షేమం కోసం నిధులందేలా ఏర్పాటు చేశారు. ఇదంతా జరిగి దాదాపు 25 ఏళ్ళు గడిచింది. ఇప్పుడు బెల్పహార్ పర్యటనకు వెళ్ళే రాజకీయనాయకులెవరైనా "థక్కర్ బప్పా సేవాసదన్"కు వెళ్ళి ఒక ఫోటో తీయించుకుంటేనే వారు నిఖార్సైన నేతలనే గుర్తింపు వస్తుంది. ఏ స్త్రీ అయినా మాతృత్వం కోసమే పెళ్ళి చేసుకుంటుంది. మరి అమ్మా అంటూ ఆరతి చుట్టూచేరే పిల్లలు బోలెడు మంది ఉండటంతో ఆమెకు భర్త అవసరం రాలేదు....

No comments:

Post a Comment