Monday, May 31, 2010
మనసున్న మానస...
మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని బ్రిలియంట్ గ్రామర్ పాఠశాలలో 10వ తరగతి చదువుకుంటున్న మానస అనే విద్యార్థిని తన పెద్ద మనసును చాటుకుంది. ఈ మధ్య స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా బల్మూర్ మండలం తుమ్మన్‌పేట వివేకానంద యువజన సంఘం నిర్వహించిన ప్రతిభా పరీక్షల్లో ఈమె విజేతగా నిలిచి ఐదు వేల రూపాయల నగదు బహుమతిని అందుకుంది. బహుమతి ఒక్కటే కాదు... దానితోపాటు వివేకానందుని ఆదర్శాల్నికూడా అందిపుచ్చుకుందీ చిన్నారి. తనకు వచ్చిన బహుమతితో వెరైటీ డ్రెస్‌లు, హైహీల్స్, ఫ్యాషన్ వస్తువులు కొనుక్కోలేదు. ఈ బహుమతి మొత్తంలో 1,116 రూపాయల్ని అచ్చంపేటలో ఖదీర్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి విరాళంగా ఇచ్చింది. అంతేగాక ఇక్కడి వృద్ధులకు అన్నదానం చేసింది. మానస తండ్రి దామోదర్ గౌడ్ లింగాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. మానసకున్న పెద్ద మనసును నేటి సమాజం అంతా అందిపుచ్చుకోవాల్సి ఉంది.... ఈమె మన నిజమైన అమ్మా...యి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment