ఆదిలాబాద్‌కు చెందిన స్నేహితురాళ్ళు దివ్య, ప్రజ్ఞ కలసి తమ దివ్యమైన ప్రజ్ఞతో అంధులకు ఊతమిచ్చే మాట్లాడే చేతి కర్రను కనిపెట్టారు. 2005లో వీరు ఇక్కడి శిశుమందిర్‌లో 10వ తరగతి చదివే రోజుల్లోనే ఈ ఘనత సాధించారు. వీరికి ప్రేరణనిచ్చింది "ప్రేమించు" సినిమాలో అంధురాలిగా నటించిన లయ పాత్ర..
వీరి ఉపాధ్యాయురాలు ఉదయ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ కర్రను తయారు చేశారు. దీనికి "టాకింగ్ బ్లైండ్ స్టిక్" అనే పేరు పెట్టారు. ఈ కర్రను ఊతంగా ఉపయోగించే అంధులకు ఏదైనా అడ్డం వస్తే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో "ప్రమాదం పొంచి ఉంది...ఆగండి" అనే సందేశం వినిపిస్తుంది. ఈ కర్ర ఉపయోగించే అంధులు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ పేరు వినిపించేలా దీనిని తయారుచేశారు.
ఒక మెసేజ్ బాక్స్, వాయిస్ రికార్డర్, ప్లగ్‌లు, ఇయర్ ఫోన్లు, వైర్లు ఉపయోగించి తయారు చేసిన ఈ కర్రకు అయిన ఖర్చు కేవలం రూ.220 మాత్రమేనట. ఇందుకోసం సెల్ ఫోన్‌లో ఉపయోగించే టెక్నాలజీని ఉపయోగించామని దివ్య, ప్రజ్ఞ చెప్పారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే దీనికి మరిన్ని మార్పులు చేసి అందరికీ అందుబాటులో తెస్తామని చెప్పారు. అమ్మాయిలా మజాకా.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment