Friday, November 27, 2009
భర్తతో ఒప్పందం
అమెరికాకు చెందిన ప్రముఖ స్త్రీవాది కాట్ కారీ (క్లింటన్) ఛాప్‌మాన్. 1859లో జన్మించిన ఈ స్త్రీమూర్తి బాధిత స్త్రీల కోసం శ్రమించిన సంఘసంస్కర్త. అమెరికాలో మొదటి మహిళా పాఠశాల సూపరింటెండెంట్‌లలో ఈమె ఒకరు. 1884లో ఈమె లియో చాంప్‌మెన్ అనే వ్యక్తిని పెళ్లాడారు. అతను అకాలమరణం చెందడంతో కాట్ కారీ 1890లో జార్జి డబ్ల్యూ కాట్‌ను వివాహమాడారు. అయితే ఈ పెళ్ళికి ముందు ఆమె తన భర్తకు కొన్ని షరతులు విధించారు. సంవత్సరంలో నాలుగు నెలల పాటు మహిళా సమస్యల పరిష్కారానికి తనను అనుమతించాలన్నది అందులో ఒకటి. ఈ రెండవ భర్త తాను తుది శ్వాస విడిచేవరకూ ఇందుకు కట్టుబడి ఉన్నాడు. 1890లో ఈమె నేషనల్ అమెరికన్ ఉమెన్ సఫరేజ్ అసోసియేషన్ సభ్యురాలిగా చేరారు. తర్వాత అధ్యక్ష స్థానానికి ఎదిగారు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఉమెన్ సఫరేజ్ ఎలియన్స్‌ను నెలకొల్పారు. 1919లో రెండు మిలియన్ల మహిళా ఓటర్లతో ఒక పటిష్ఠమైన సంస్థను ఏర్పాటు చేశారు. ప్రపంచశాంతికి తన వంతు కృషిచేసిన కాట్ కారీ మహిళాలోకానికి చిరస్మరణీయురాలు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment