Thursday, November 26, 2009
బాలల అయ్య-మ్మ
బెంగళూరు కె ఆర్ మార్కెట్ సమీపానగల ఒక మురికివాడ వాసి 21 సంవత్సరాల అయ్యమ్మ. మూడేళ్ళప్పుడు తండ్రి చనిపోయాడు. తొమ్మిదేళ్ళ వయసునుంచే ఒక గిడ్డంగిలో పెట్టెలు మోసే పనిచేసేది. తర్వాత బట్టల దుకాణంలో పని చేస్తూ సాయంత్రం వేళల్లో పేద విద్యార్థులకు పాఠాలు చెబుతుంది. ఆ సమయంలో బాల కార్మికుల హక్కులపై పోరాడే ఒక స్వచ్ఛంద సంస్థ ఊతమివ్వడంతో అయ్యమ్మ తన ప్రతిభా పాటవాలు కనబరచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. బాలల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఏర్పాటు చేసిన కమిటీకి సలహాదారుగా వ్యవహరించిన అయ్యమ్మ మన దేశంలో బాలలపై చోటుచేసుకుంటున్న హింసాకాండపై అప్పటి ఐరాస ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్‌ను నేరుగా కలుసుకుని నివేదిక సమర్పించింది. నార్వే దేశంలో 2004 జూన్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో ఈమె పాల్గొని ప్రసంగించింది. 2005 జూన్‌లో బాలలపై హింసను వ్యతిరేకిస్తూ జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొంది. అయ్యమ్మ విజయాలను ప్రశంసిస్తూ ఈమె జీవితంపై ఐక్యరాజ్య సమితి ఒక లఘుచిత్రం నిర్మించింది. ప్రపంచవ్యాప్తంగా ఐదుగురు బాలల జీవితాలపై తీసిన డాక్యుమెంటరీల్లో (2006 నాటికి) ఆసియా ఖండంలో అయ్యమ్మపై మాత్రమే లఘుచిత్రాన్ని నిర్మించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment