Monday, July 26, 2010

లక్ష్మీకాంతం... కోమల హృదయం

"ఇంటికంటే గుడిపదిలం" అని మనకో పాత సామెత ఉంది. నేటి పరిస్థితులు అలా లేవుగానీ... అనాథలకోసం పదిలమైన గుడిలాంటి వాతావరణాన్ని మాత్రం ఏర్పాటు చెయ్యగలిగారు విశాఖపట్నానికి చెందిన చదరం లక్ష్మీకాంతం. తనకు వచ్చే పింఛన్, తన ఇంటి బాడుగ మొత్తం, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న తన పిల్లలు పంపే మొత్తంతో ఈమె తన సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తుంటారు. అంధులు, అన్నార్తులు, వృద్ధులకు అండగా ఉంటున్నారీమె.
సుమారు 45 ఏళ్ళ కిందట భర్త జగన్నాథంతో కొత్తవలసలో కాపురం చేసే రోజుల్లోనే అక్కడ మహిళామండలిని నెలకొల్పిన లక్ష్మీకాంతం ఆ తర్వాత విశాఖపట్టణం వచ్చి గీతా మహిళామండలిలో సేవలందించారు. ఇక్కడ పలువురు మహిళలకు కట్లు అల్లికలు, నాట్య కళల్లో శిక్షణనిప్పించారు. శ్రీ గౌరీ సత్యసాయి సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తూ సామూహిక వివాహాలకూ తోడ్పాటునిస్తున్నారు. ఈ అమ్మా....యి అందరికీ ఆదర్శం కదూ...